కష్టాల్లో టీమిండియా….
హైదరాబాద్:ఆస్ర్టేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ పోరులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 108 పరుగులు వద్ద రైనా(7) ఫాల్కనర్ బౌలింగ్‌లో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఒత్తిడికి తట్టుకోలేక వెంటవెంటనే వికెట్లు కోల్పోతుండడంతో అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. 24 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 110 పరుగులు చేసింది.