కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశాం: షిండే

ఢిల్లీ: ముంబయి మారణహోమంలో సజీవంగా పట్టుబడ్డ పాక్‌ జాతీయుడు అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే  తెలియజేశారు. సుప్రీం కోర్టు ఖరారు చేసిన మరణశక్షపై కసబ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను నవంబర్‌  5న రాష్ట్రపతికి పంపినట్లు వెల్లడించారు. షిండే చెప్పారు. పిటిషన్‌ తిరస్కరణ అనంతరం ఈ ఉదయం పుణె ఎరవాడ జైల్లో ఉరిశిక్షను అమలు చేసినట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని పాక్‌ ప్రభుత్వానికి చేరవేసినట్లు చెప్పారు. కసబ్‌ మృతదేహాన్ని పంపమని ఆ దేశం కోరలేదని పేర్కొన్నారు. ఉరిశిక్షను రహస్యంగా అమలు చేయడం తప్పనిసరని చెప్పారు. 26/11 ముంబయి దాడులకు సంబంధించి న్యాయ విచారణ పూర్తయినట్లు వెల్లడించారు.