కసబ్ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం: ఖుర్షీద్
ఢిల్లీ: కసబ్‌కు ఉరి శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుత్దోందని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలియజేశారు. కసబ్ ఉరితీతపై ముందుగానే పాకిస్థాన్ ప్రభుత్వానికి సమాచారమందించినట్లు చెప్పారు. కసబ్ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని ఆన్నారు. న్యాయస్ధానం నిర్ణయం మేరకే ఉరిశిక్షను అమలుపరిచినట్లు వెల్లడించారు.