కస్తూరిబా పాఠశాలలో ఉపాధ్యాయుల డుమ్మా
జమ్మికుంట టౌన్, జూన్ 12 (జనంసాక్షి): పాఠశాల ప్రారంభం రోజున జమ్మికుంట కస్తూరి భా పాఠశాలకు చెందిన పలువురి ఉపాధ్యాయురాలు పాఠశాల గైర్హాజరు కావడం పట్ల మంగళవారం ఆ కస్మిక తనిఖీకి వచ్చిన ఉప విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆగ్రహాం వ్యక్తం చేశారు.స్థానిక కస్తూరి భా పా ఠశాలకు ఆయన వెళ్ళి చూడగా సెష్పల్ ఆఫీసర్ వనజ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న రిజిషర్టులను చూసి వెళ్ళి పోయారు.జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్,జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉప విద్యాధికారి టి.వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేసి హాజరు పట్టికను త నిఖీ చేసి ఉపాధ్యాయుల ప్రవర్తనపై పరిశీలన జరిపారు. తొలి రోజు పాఠశాల పున:ప్రారంభం అవు తుండడంతో ఉపాధ్యాయులు గైర్హాజరు అవుతారనే ఉదేశ్యంతో ఉప విద్యాధికారి ఈ తనిఖీలను చేపట్టారు. ఆయన వెంట జమ్మికుంట ఎంఇవో బావనాఋషి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.