కస్తూర్బా పాఠశాలను తనిఖీచేసిన పీవో
కరీంనగర్,ఫిబ్రవరి28(జనంసాక్షి): సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి నర్సింహ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్నభోజనం తదితర సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి, పాఠశాల ప్రత్యేకాధికారిణి స్వప్న తదితరులు ఉన్నారు.సైదాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు శనివారం వైజ్ఞానికి ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ రకాల ప్రయోగాలతో చిన్నారులు తమ ప్రతిభను కనపరిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.