కాంగ్రెస్‌లో కొనసాగలేం
రాజీనామాలు ఆమోదించండి తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు
ఫార్మాట్‌లోనే రాజీనామాలు టీ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్, జనవరి 29 (జనంసాక్షి):
:తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తోందని, ఇక ఆ పార్టీలో కొనసాగలేమని తెలంగాణ ఎంపీలు తేల్చి చెప్పారు. తెలంగాణపై నెల రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామన్న షిండే మాట మార్చారని, ప్రస్తుతం తమకు తెలంగాణ ఏర్పాటు తప్ప ప్రత్నామ్యాయమేమీ లేదని పేర్కొన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపుతామని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ బాటలోనే వస్తారని ఆశిస్తున్నామని ఎంపీ రాజయ్య తెలిపారు. కాంగ్రెస్‌లో మేం కొనసాగలేమని, మా రాజీనామాలకు అర్థం ఉందని, వెంటనే వాటిని ఆమోదించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమని, ఐక్యంగా కలిసి ముందుకు సాగుతామని కే. కేశవరావు స్పష్టం చేశారు. తాము ఇంతకాలం పార్టీకి విధేయులుగా ఉన్నామని, కానీ పార్టీ తమను నిరాశ పరిచిందని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉందంటే కేవలం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వల్ల మాత్రమే అని పేర్కొన్నారు. ఇకనైనా అధిష్టానం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తిస్తే బాగుంటుందని కోరారు.