కాంగ్రెస్‌లో లీడర్లు తప్ప కేడర్ ఉండదు
బిజెపి అధ్యక్షుడు నడ్డా వెల్లడి
భోపాల్,జూన్1(జనంసాక్షి): కాంగ్రెస్‌లో అంతా లీడర్లు తప్ప కార్యకర్తలు ఉండరని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా అన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తే స్వయంగా చెప్పాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తను కలిశానని ఆ కార్యకర్త తనతో చెప్పిన విషయాలను బుధవారం ఆయన విూడియాతో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లే ఉంటారని, క్యాడర్ ఏమాత్రం ఉండదని ఆ కార్యకర్త తనతో చెప్పినట్లు నడ్డా చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఆయన భోపాల్‌లోని రాజభోజ్ ఎయిర్‌పోర్ట్‌లోనే విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిరచారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తను కలిశాను. పార్టీకి 40 మంది మహామంత్రులు, 156 మంది మంత్రులు ఉన్నారు కానీ ఒక్క కార్యకర్త లేడని నాతో చెప్పాడు. కానీ బీజేపీ పాలసీ దేశమే ముందు. దేశం కోసం మాత్రమే మేము పనిచేస్తాం. మా కార్యకర్తలే బీజేపీని ఉన్నత స్థానంలో నిలబెట్టారు‘ అని నడ్డా అన్నారు.