కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..
ప్రత్యేక ¬దాపైనే తొలి సంతకం
– రాష్ట్రంలో రూ. 2లక్షల రుణమాఫీ
– పాలనచేపట్టిన 100రోజుల్లోనే ఖాళీ పోస్టులను భర్తీచేస్తాం
– బీసీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ 9లో కాపులను కలుపుతాం
– ఎన్నికల ఫ్రీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
విజయవాడ, అక్టోబర్1(జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రత్యేక ¬దాపైనేనని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను రఘువీరా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ¬దాపైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని అన్నారు. రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని రఘువీరా హావిూ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్నారు. ఏపీలో ప్రతి డ్వాక్రా గ్రూపునకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పెన్షన్ విధానాన్ని వయసును బట్టి స్లాబుల విధానం తెస్తామన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను షెడ్యూల్ 9లో కలుపుతామన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, పేద కుటుంబాల వారికి ఏడాదికి 4సిలిండర్లు ఇస్తామన్నారు. పెన్షన్ విధానాన్నివయస్సులకు అనుగుణంగా శ్లాబ్ విధానం తెస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేస్తామని రఘువీరా తెలిపారు. మంగళవారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేసి.. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రఘువీరా స్పష్టం చేశారు.