కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించిన విద్యార్ధి సంఘాలు
వరంగల్ : తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్‌లో విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థులకు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులను అదుపుచేయడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను అడ్డుకోవడంతో వారు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులకు అడ్డుకోవడంతో వారు కార్యాలయంపైకి రాళ్లదాడికి దిగారు. అనంతరం విద్యార్థులు కాంగ్రెస్ నేతల ప్లెక్సీలను చించివేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.