కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కరీంనగర్, ఆగస్టు 24 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో కాంగ్రెస్ నేతల అరెస్ట్ అప్రజాస్వామికమని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న పొన్నం, మృత్యుంజయం సహా 40 మంది నేతలను అరెస్ట్ చేయడాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేసి, తోటపల్లి రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.