కాంగ్రెస్ పాలనలోనే పటిష్ఠంగా దేశం
దేశానికి స్వాతంత్య్రం తీసుకుని వచ్చిన పార్టీ
మోడీ పాలనలో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ
క్విట్ ఇండియా ఉద్యమ సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్
గాంధీభవన్‌లో జెండా ఎగురేసిన పిసిసి చీఫ్ రేవంత్
హైదరాబాద్,అగస్టు9(జనంసాక్షి): కాంగ్రెస్ పాలనలో దేశం ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా నిలబడిరదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్యర్ర తీసుకొచ్చి స్వేఛ్చా వాయువులని ఇచ్చిందన్నారు. మోదీ పాలనలో దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టారన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను మోదీ తీసుకొచ్చి దేశంలో రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. పెట్రో ధరలు
పెంచుతూ మోదీ సర్కార్ దేశంలో సామాన్యుల నడ్డి విరుస్తోందని రేవంత్ పేర్కొన్నారు. లక్షలాది మంది త్యాగాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్యర్ర అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 79 ఏండ్లు నిండిన సందర్భంగా ఈ నేపథ్యంలో జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకుంటూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ వేడుకలు నిర్వహించింది. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సాధించాలి లేదా ప్రాణాలైనా వదలాలనే నినాదం దేశానికి స్వాతంత్యాన్న్రి తెచ్చిందన్నారు. ’సంపూర్ణ స్వాతంత్యంª`ర తప్ప మరే ప్రత్యామ్యాయాన్ని అంగీకరించేది లేదని మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతా వ్యాపించింది. భారత్‌ను ప్రపంచం ముందు శక్తిమంతమైన దేశంగా కాంగ్రెస్ నిలిపింది. కానీ ఏడేళ్ల పాలనలో మోడీ దేశాన్ని అప్పులపాలు చేశారు. మోడీ, కేసీఆర్ అధికారం చేపట్టాక బ్రిటీష్ విధానాలను అవలంభిస్తున్నారు. ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తున్నారు. తెలంగాణను సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేశారు. సోనియా ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఇచ్చారో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ పేర్కొన్నారు. ’శక్తిమంతమైన దేశంగా ఎదగాల్సిన ఇండియాను రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి బానిసలుగా చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోంది. జీడీపీని పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ.. గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలు పెంచి పేదవాడి నడ్డి విరిచారు. మోడీ హయాంలో పేదోళ్లు బతికే పరిస్థితి లేదు. వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితి నెలకొంది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతిలో, 130 కోట్ల మంది మోడీ చేతిలో బందీ అయ్యారు. కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం క్విట్ తెలంగాణ ఉద్యమానికి యువత ముందుకు రావాలి. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తీసుకురావాలి. స్వేచ్ఛ, సామజిక న్యాయం కోసం 20 నెలలు కష్టపడదాం. ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ఒకరు ముందుకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. తెల్లదొరల ఫాసిస్ట్ విధానాలని దేశంలో నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ కేసీఆర్‌ల ఫాసిస్ట్ విధానాలని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉంది. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ఆశయాలు నెరవేరాలని సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదు. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ గద్ద దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. కెసిఆర్ ప్రత్యేక తెలంగాణలో తాను అదికారాలు అనుభవిస్తూ ప్రజలను నానా యాతనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.