కాంగ్రెస్‌ పూర్వవైభవానికి కృషి చేయాలి

– బీజేపీ, టీడీపీల ప్రజావ్యతిరేఖ విధానాలతో ప్రజల్లోకి వెళ్లండి
– హోదా రాకపోవడానికి బీజేపీ, టీడీపీలే కారణం
– కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం
– కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్‌ చాంది
విజయనగరం, జులై17(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవానికి ప్రతీ ఒక్క కార్యకర్త కృషిచేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ పిలుపునిచ్చారు. మంగళవారం భోగాపురం మండలం మహరాజపేట వద్ద నెల్లిమర్ల నియోజకవర్గం లఓ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ సరగడ రమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమెన్‌ చాందీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా రాకపోవడానికి బిజెపి, టిడిపిలే కారణమన్నారు. ఈ రెండు పార్టీలు ప్రత్యేక ద్రోహులని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విభజన హవిూల అమలు ఫైలు పైనే రాహుల్‌ తొలి సంతకం చేస్తారన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు మోడీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు దీక్షలు, ఆందోళనలతో ప్రత్యేక ¬దా అంటున్నారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ రెండేనని ఈ పార్టీల వల్ల ఏపీకి జరిగే లాభం ఏవిూ ఉండదన్నారు. వారివారి స్వలాభం కోసం ప్రజలను ముంచేందుకు బీజేపీ, టీడీపీలు ఎప్పుడు ముందంజలో ఉంటాయన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జిల్లా పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ పీరుగట్ల విశ్వ ప్రసాద్‌, జిల్లా పార్టీ అధ్యక్షులు యండ్ల ఆదిరాజు, నాయకులు ద్రోణం రాజు, శ్రీనివాసరావు, రవి, సూరిబాబు , అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. గజ మాలలతో ఉమెన్‌ చాందిని రమేష్‌ కుమార్‌ దంపతలు సన్మానించారు.
ఎర్రకోటలో 2019లో జాతీయ జెండాను ఎగురవేసేది రాహులే – రఘువీరారెడ్డి
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఏపిసిపి చీఫ్‌ రఘువీరారెడ్డి  అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలను ఉమెన్‌ చాందీ స్వయంగా సవిూక్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తోనే ప్రత్యేక ¬దా సాధ్యమన్నారు. వందల వేల కోట్లు సంపాదించిన వారు పార్టీని వీడారు కాని..బలమైన కార్యకర్తలు కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పారు. విజయనగరం జిల్లాకు అధికార పార్టి ఇచ్చిన ఏ ఒక్క హావిూ నెరవేర్చలేదని విమర్శించారు.
ఎయిర్‌పోర్టు, మెడికల్‌ కాలేజి, ఫుడ్‌ పార్కు, హార్డ్‌ వేర్‌ పార్కుల జాడే లేవన్నారు. 2019 ఆగస్ట్‌ 15వ తేదీన ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసేది రాహుల్‌ గాంధీనే ఆశాభావం వ్యక్తం చేశారు

తాజావార్తలు