కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం

కొహెడ, కరీంనగర్‌ (జనంసాక్షి):తెలంగాణపై కాంగ్రెస్‌ వెనక్కి తగ్గితే మళ్లీ ఉద్యమం చేపడతామని తెరాస హుస్నాబాద్‌ నియోజకవర్గ బాధ్యులు వి. సతీశ్‌కుమార్‌ అన్నారు. పల్లెబాటలో భాగంగా ఆయన మండలంలోని వింజపల్లి, రాంచంద్రాపూర్‌, వరికోలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఈ నెల 28లోపు సానుకూల ప్రకటన వెలువరిస్తుందన్న భయంతోనే సీమాంధ్ర నాయకులు కృతియ ఉద్యమాలు, రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ సభ్యుడు కె.శ్రీహరి, మండల పార్టీ అధ్యక్షుడు ఎ.మహేందర్‌, ఎన్‌. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.