కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలు రెండూ ఒక్కటే : కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ పార్టీలు రెండు ఒక్కటేనని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన టీఆర్‌ఎస్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు ఆయన టీఆర్‌ఎస్ భవన్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సర్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. నిన్న భవన్‌లోకి పోలీసులు చొరబడ్డారని అందుకే సార్‌కు పాలాభిషేకం చేశామని అయన వేల్లడించారు. విజయలక్ష్మి సిరిసిల్ల పర్యటన సందర్భంగా ప్రభుత్వం కోట్ల డబ్బు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. విజయలక్ష్మిని అరెస్టు చేయకుండా తెలంగాణా ప్రజలను ఎలా అరెస్టు చేశారని ఆయన ప్రభుత్వాన్ని నిలాధిశారు. విజయలక్ష్మికి నిజంగా తెలంగాణాపట్ల ప్రేమ ఉంటే కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై లేఖ ఇవ్వలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు.