కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

గాంధీభవన్‌లో మళ్లీ కనిపిస్తున్న సందడి
హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. టీపీసీసీ చీఫ్‌గా పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ఇందిరాపార్కు వద్ద ధర్నా, ఇంద్రవెల్లి సభలకు అనూహ్యంగా మద్దతు దక్కడంతో కాంగ్రెస్‌లో నేతలు సైతం ఇప్పుడు
గాంధీభవన్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏకి ప ఆరేయడమే లక్ష్యంగా రోజూ విూడియా ముందుకు వస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రసంగాలు కూడా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతు న్నాయి. కార్యకర్తల్లో భరోసాను ఇస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సక్సెస్‌ అయింది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కాళాకారులు దూంధాం ఆట పాటలు అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా గుస్సాడిల నృత్యాలు సభలో ప్రత్యేకతను చాటుకున్నాయి.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎన్నికైన తర్వాత తొలిసారి ఇంద్రవెల్లిలో దళిత దండోరా సభను నిర్వహించ డంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ కనిపించింది. లక్షమందితో దండోరాను నిర్వహిస్తామని చెప్పినట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీగా జన సవిూకరణను చేశారు. 18 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగానే జనం హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష జనాభా వరకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సభకు హాజరైనట్టేనని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ శ్రేణులు చప్పట్లు, కేరింతలు కొడుతు ఉత్సాహాంగా కనిపించారు. దాదాపుగా 30 నిమిషాల పాటు రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సభాస్థలికి రాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కొందరు పోలీసు అధికారులు టీఆర్‌ఎస్‌ పార్టీకి గులాంగిరి చేస్తున్నారంటూ హెచ్చరించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ రేవంత్‌రెడ్డి ప్రసంగానికి మద్ధతుగా నిలిచారు.