కాంటాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: జే ఏ సి

కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం

అఖిలపక్ష పార్టీల జేఏసీ నాయకులు డిమాండ్

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 15 (జనం సాక్షి):కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని, ప్రైవేట్ కంపెనీ కాంటాక్ట్ కార్మికులు సమ్మెలోకి రావాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.గురువారం మణుగూరు సిపిఐ పార్టీ కార్యాలయంలో.ఆర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాంట్రాక్టు కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మంది సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అక్రమ అరెస్టులు నిర్బంధాలతో కార్మికులను ఇబ్బందుల గురి చేస్తున్నారని, వారిపై లాఠీను జులిపీ స్తున్నారని, కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలిపే హక్కు లేకుండా నిర్బంధిస్తున్నారని వారు ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు రేపు 16వ తేదీ జరుగు చర్చల్లో పరిష్కారం చేయాలని, లేని పక్షంలో రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు అన్నారు.
కనీస వేతనం అమలు చేయాలని ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్స్ తోటి కార్మికులు చేస్తున్న ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూన్నాయి. ప్రభుత్వం తో చర్చలు సఫలం అయ్యే విధంగా చూడాలని , లేకుంటే అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ఓబీలలో యాజమాన్యం ఒత్తిడి తోటి కార్మికులను పనిచేపిస్తున్నారని ఇది సరైన విధానం కాదని ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాల గుర్తించాలన్నారు. కార్మికులు కూడా తమ హక్కుల కోసం సమ్మెలోకి రావాలని వారు పిలుపునిచ్చారు.
అఖిలపక్ష పార్టీలు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం సింగరేణి జిఎం కు వినతిపత్రం అందించనున్నట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలోఅఖిలపక్ష పార్టీల నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, కొడిశాల రాములు (సిపిఎం) మున్నా లక్ష్మీ కుమారి. ఆర్ లక్ష్మీనారాయణ. (సిపిఐ), వట్టం నారాయణ వాసిరెడ్డి చలపతిరావు (తెలుగుదేశం ) కంప రవి, కొమరం రామ్మూర్తి( కాంగ్రెస్) మిడిదొడ్ల నాగేశ్వరరావు (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ) ఆర్ మధుసూదన్ రెడ్డి (సిపిఐ ఎంఎల్ ప్రజా బంధ)
సోమేశ్వర్ గౌడ్ (వైయస్సార్ టిపి) సిపిఐ పట్టణ కార్యదర్శి సుధాకర్ జిల్లా సమితి సభ్యులు అక్కి నరసింహారావు సోందే కుటుంబరావు ఎస్ కే సర్వర్ సర్పంచ్ బాడిష సతీష్సిపిఎం నాయకులు శ్రీనివాస్ ,టి ఎన్ వి ప్రసాద్, నంద ఈశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుండి వరలక్ష్మి సాంబశివరావు ,పాపారావు తదితరులు పాల్గొన్నారు.