కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవ కార్యక్రమం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలి
కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఒక రోజు కార్యక్రమం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కాకతీయ వైభవ సప్తా హాం ఉత్సవాలు ఈ నెల 7 నుంచి 13 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లో నిర్వహిస్తున్నట్లు,అందు లో బాగంగా ఈ నెల 11న నల్గొండ జిల్లాలో నకిరేకల్ మండలం చందుపట్ల లో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈనెల 11న కాకతీయ వైభవ సప్తాహ కార్యక్రమం నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చర్చించి సమీక్షించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో కాకతీయ రుద్రమదేవి మరణ కాలాన్ని ప్రస్తావిస్తూ ఏర్పాటుచేసిన చందుపట్ల శిలాశాసనం ఉన్నందున, ఇది కాకతీయుల పరిపాలన సంబంధించిన అతి ముఖ్యమైన అరుదైన శాసనంగా ఆయన పేర్కొన్నారు. చందు పట్ల లో కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమం ఈ నెల 11 న నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఏర్పాట్ల కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి వైభవాన్ని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాలు తోపాటు పేరిణి నృత్యం,కూచిపూడి, నాటకం, సాంస్కృతిక సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు.
నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, స్థానికంగా స్టేజి,ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కాకతీయుల చరిత్ర ప్రాశస్త్యం గురించి విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన,క్విజ్ పోటీలు పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా ఎంపిక చేసిన వారికి ఆ రోజున సర్టిపికెట్ లు ప్రధానం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కాకతీయుల చరిత్ర గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన యూనివర్సిటీ చరిత్ర అధ్యాపకులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం లో డి.అర్ ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.ఈ. ఓ బిక్షపతి,డి.పి.అర్. ఓ.శ్రీనివాస్,జిల్లా క్రీడలు,యువజన అధికారి మక్బూల్ అహ్మద్, ఎస్.పి.సి.డి.సి.ఎల్ డి. ఈ. విద్యా సాగర్,కలెక్టరేట్ పరిపాలన అధికారి మోతి లాల్,నకిరేకల్ ఎం.పి.డి. ఓ.వెంకటేశ్వర్ రావు,తహశీల్దార్ పాల్గొన్నారు.