కాగ్‌ మరింతగా వృద్దిని సాధించిందిదాని సూచనలు

ప్రభుత్వంలో అభివృద్దికి దోహదంఎన్నో సంస్థలు మనుగడ సాగించకున్నా కాగ్‌

బలపడిరదికాగ్‌ దినోత్సవంలో ప్రధాని మోడీ వెల్లడి

న్యూఢల్లీి,నవంబర్‌16(జనం సాక్షి ):

ఎన్నో సంస్థలు తమ ఉనికిని పోగొట్టుకుంటున్నా..కాగ్‌ మాత్రం వారసత్వంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఆడిటింగ్‌ అంటే ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపుతుందనే భ్రమలు ఉండేవన్నారు. ప్రతి జనరేషన్‌ కాగ్‌ను స్పర్శిస్తోందని, కాగ్‌పై బాధ్యతలు పెరిగినట్లు ప్రధాని అన్నారు. ఒకప్పుడు అనుమానంతో, భయంతో ఆడిటింగ్‌ను చూసేవారని, కాగ్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ అన్న మైండ్‌సెట్‌ ఉండేదని, ప్రతి అంశంలోనూ కాగ్‌ తప్పుల్ని వెతుకుతుందని అధికారులు భావించేవారని, కానీ ప్రస్తుతం ఆ మైండ్‌సెట్‌ మారిందని, ఈ రోజుల్లో ఆడిట్‌ను కీలకమైందిగా భావిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఆడిట్‌ దివస్‌లో భాగంగా ఢల్లీిలో జరిగిన కాగ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మరింత బలోపేతం అయ్యాయని, మరింత పరిణితి సాధించాయని, సమయంతో పాటు అవి మరింత కీలకంగా మారినట్లు ప్రధాని మోదీ అన్నారు. చాలా వరకు సంస్థలు కొన్ని దశాబ్దాల తర్వాత తమ ఉనికిని కోల్పోతాయని, కానీ ప్రభుత్వ పనులను అంచనా వేయడంలో కాగ్‌ అభిప్రాయాలకు అడ్వాంటేజ్‌ ఉందని, కాగ్‌ చేసే సూచనలతో వ్యూహాత్మక పురోగతి జరుగుతుందని, దాన్ని సహకారంగా భావిస్తామని ప్రధాని అన్నారు. పారదర్శకత లేకపోవడం వల్లే గతంలో బ్యాకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు పెరిగాయని, కానీ తమ ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని దేశం ముందు పెట్టిందన్నారు. సమస్యలను గుర్తిస్తేనే పరిష్కారాలు వీలవుతాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు కాగ్‌ అడిగిన సమాచారాన్ని, డాక్యుమెంట్లు, డేటా, ఫైల్స్‌ ఇవ్వాలన్నారు. ఆర్థికలోటు, ప్రభుత్వ ఖర్చుపై కాగ్‌ ఆందోళనలను సరైన స్పూర్తితో స్వీకరించామని మోదీ తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో, బలంగా ఆడిట్లు సాగితేనే, వ్యవస్థ స్థిరంగా, పారదర్శంగా తయారవుతుందని ప్రధాని చెప్పారు. మంచి పద్ధతులపై కాగ్‌ స్టడీ చేయాలన్నారు. డేటానే సమాచారమని, భవిష్యత్తులో డేటానే చరిత్రను శాసిస్తుందని ప్రధాని తెలిపారు.