కాఫీ ఇచ్చే అలారం
ఆ అలారం క్లాక్‌పైనే ఓ గాజుపాత్ర.. నీటిని వేడిచేసేందుకు దాని అడుగున రెండు స్టీల్ బాల్స్ ఉంటాయి. ఆ గాజు పాత్రలో వేడి అయిన నీళ్లు పక్కనే ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ ఫీల్టర్‌లో పడేలా ఓ గాజుగొట్టం కూడా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఫీల్టర్‌లో కాఫీ లేదా టీ పొడి నింపుకొని.. దాని పక్కనే ఉండే చిన్న గ్లాసులో పాలను ఉంచి.. ఉదయానికి అలారం పెట్టుకుంటే సరిపోతుంది.
అలారం పెట్టుకున్న సమయానికి ఈ క్లాక్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒక్కసారి అలారం క్లాక్ ఆన్ అవ్వగానే నీళ్లు వేడి అయి కాఫీ లేదా టీ పొడి ఉన్న ఫీల్టర్‌లోకి వచ్చి చేరుతుంది. డికాషన్ తయారై ఫీల్టర్ కింద ఉన్న కప్‌లో వచ్చి చేరి అలారం మోగుతుంది. ఇక నిద్రలేచి పక్కనే ఉంచిన పాలను కలుపుకుంటే చాలు వేడివేడి కాఫీ రెడీ అయిపోతుంది.
దీన్ని తయారుచేస్తున్నట్లు 2014లోనే ప్రకటించగా.. ఇటీవల ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. ఈ అలారం క్లాక్‌కి తుదిమెరుగులు దిద్ది వచ్చే ఏడాదిలో మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నాడు జోషున.