కామాటీల నియామకపు టెండర్లను రద్దు చేయాలి
కోదాడ టౌన్ జూలై ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతి పై నియామకం చేపట్టిన 70 మంది కామాటీల టెండర్లను తక్షణమే రద్దు చేయాలని పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి బదులుగా గడిచిపోయిన 2021-22 సంవత్సరానికి టెండర్లు పిలిచి కామాటిల నియామకం చేపట్టారాని టెక్నికల్ గా గడిచిన సంవత్సరమునకు నియామకాలు ఇప్పుడు చేపట్టడం జీతాలు ఇవ్వడం చట్ట రిత్యా నేరం కావున దీనిని పరిగణలోకి తీసుకొని ఇట్టి టెండర్ నియామకలను రద్దుచేసి తిరిగి ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టబోయే నియామకాలకు కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలని కోరుతూ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్లు గంధం యాదగిరి,షాబుద్దీన్,సామినేని నరేష్,కోళ్ల కోటిరెడ్డి, లంకెల నిరంజన్ రెడ్డి,కర్రి శివ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area