కామారెడ్డి జిల్లాలో అవగాహన సదస్సు. నియామక పత్రాలు అందజేసిన అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్

ప్రతి కమిటీ సభ్యుడు సేవా దృక్పథం తో ముందుకు వెళ్లాలి.
 తొర్రూర్ 27 జూన్ (జనంసాక్షి )కామారెడ్డి జిల్లా ఈరోజు సోమవారం స్థానిక విశ్రాంతి భవనంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు లీగల్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా  నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మంగళ పెళ్లి హుస్సేన్ వచ్చి  నూతన కమిటీ సభ్యులకు సర్టిఫికెట్స్ ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా భో పాల్. జనరల్ సెక్రెటరీగా రతన్ కుమార్. జాయింట్ సెక్రటరీగా రాజమ్. దోమకొండ మండల ప్రెసిడెంట్గా నవీన్ కుమార్. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ గా చంద్రకాంత్. సోషల్ సర్వీస్ ప్రెసిడెంట్ బసవరాజ్. నవీన్ రెడ్డి. నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలంలో కమిటీలు వేసి విద్యార్థులకు ప్రజలకు మానవ హక్కుల పరిరక్షణ పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం కలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మాచర్ల శ్రీనివాస్. వరంగల్ జిల్లా బంగారు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్గా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సమాజంలో అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.