కామ్రేడ్ ముక్తార్ పాష ఆశయాలను కొనసాగిద్దాం * ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎండి రాసుద్దిన్

టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి): కామ్రేడ్ ముక్తార్ భాష ఆశయాలు కొనసాగించాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎండి రాసుద్దీన్ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య (ఐ ఎఫ్ టి యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాషా మూడో వర్ధంతి సందర్భంగా మంగళవారం టేకులపల్లి హమాలి కార్మికుల అడ్డ వద్ద మండల అధ్యక్షులు బోడ మంచ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ ముక్తార్ పాషా చదువుకునే రోజుల్లో పి డి ఎస్ యు ద్వారా ఉద్యమ పాఠాలు నేర్చుకొని కార్మిక వర్గ పక్షపాతిక పీడిత ప్రజల విముక్తి సాధనే లక్ష్యంగా 40 సంవత్సరాల పాటు విప్లవ ఉద్యమమే ఆశగా శ్వాసగా జీవించిఅనారోగ్యంతో 24/9/2020 న మరణించడం భారత కార్మిక ఉద్యమానికి కాక విప్లవోద్యమానికి కూడా తీవ్ర నష్టకరమైందని ఆయన అన్నారు. ఖమ్మం,వరంగల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాల్లో పాషా తెలియని వారు లేరని అనేక పోరాటాలలో ముందు వరుసలో నిలిచినాడని దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక వర్గ పోరాటాలలో అగ్ర భాగాన నిలిచినాడని సింగరేణి, టైల్స్, మోటర్, హమాలి తదితర సంఘటిత,అసంఘటిత కార్మిక వర్గానికి దశను దిశను చూపించే నాయకుడిగా ఎదిగిన విప్లవ వీరుడు అని అన్నారు. ఉద్యమం క్రమంలో అనేక నిర్బంధాలు,చిత్రహింసలు,జైలు జీవితం గడిపేడని తను నమ్ముకున్న రాజకీయాల కోసం ప్రతిఘటన పోరాటాలను ముందుకు తీసుకెళ్లే ఉద్యమ క్రమంలో తన వంతుపాత్రను పోషించాడని అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70 కోట్ల మంది కార్మికుల శ్రమ దోపిడీకి గురి చేస్తుందని కార్మిక చట్టాలనే మార్చి పని భారం మోపుతుందని ఈ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించా లని కోరారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల ఐ ఎఫ్ టి యు కార్యదర్శి �