కారు గెలుపు ఖాయం

*మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం
మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి):
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గెలుపు ఖాయమని టిఆర్ఎస్ మునుగోడు మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం అన్నారు. ఆదివారం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు.మిత్రపక్షాలు బలపర్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరరు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఐదేండ్ల కోసం ఎన్నుకుంటే నాలుగేండ్లకే రాజీనామా చేసి బిజెపి కి రూ.18వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయాడని,అందువల్లే మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చాయని మండిపడ్డారు.ఆయన ఇప్పుడు గెలిచినా చేసేదేమీ లేదని,మళ్లీ కాంట్రాక్టులకు అమ్ముడుపోతాడని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేశారని విమర్శించారు.
మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయమే తమ ద్యేయమన్నారు.ఈకార్యక్రమంలో బొల్ల శ్రీనివాస్,ఐతగొని రవి, బొడ్డుపల్లి రమేష్,పెంబళ్ల శ్రీకాంత్,మందుల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.



