కారోబార్ ను సర్పంచ్ . భర్త వేధిస్తున్నారని ఫిర్యాదు

జూలై 11జనంసాక్షి

మండలంలోని వేములపల్లి గ్రామ పంచాయితీ కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న పంతం వెంకట వీరయ్య ను గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత ఆమె భర్త నాగిరెడ్డి సంజీవరెడ్డి తన సొంత పనులు చేయమని బూతులు తిడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని మండల పంచాయతీ అధికారి అప్సర్ పాషాకు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తాను గత 39 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు.కాగా ఇటీవల కొంతకాలంగా సొంత పనులు చెయ్యమంటే చేయనందున తిడుతూ, కించపరుస్తూ,తీర్మానాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్న సర్పంచ్ వసంత,ఆమె భర్త నాగిరెడ్డి సంజీవరెడ్డి పై ఎస్సి ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంతను ఫోన్లో వివరణ కోరగా అందుబాటులో లేక తన భర్త సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాను సుమారు గత రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామానికి ఇటుకలు తక్కువ పడడంతో 500 ఇటుకలు తీసుకురమ్మని తన సొంత ట్రాక్టర్ ఇచ్చి కరోబార్ ను, సిబ్బందిని పంపించానని అంతేతప్ప ఎటువంటి పనులు చెప్పలేదని తెలిపారు. కాగా అతడు(64)వయసు పైబడి పనులు చేయలేకపోతున్నాడని తన వారసులు ఎవరైనా ఉంటే తన స్థానంలో పెట్టమని కోరగా స్పందించలేదని తెలిపారు. తాను ఎప్పుడు దళితుడనే భావనతో తిట్టలేదని ఒక మాట కూడా లేదని అన్నారు.