కార్డెన్ సెర్చ్ పోలీసులు చేశారు

జనం సాక్షి టీవీ కామారెడ్డి జిల్లా
రాజంపేట్ మండలంలోని బసవన్న  పల్లి గ్రామంలో రాజంపేట్ ఎస్సై రాజు, ఆధ్వర్యంలో  కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పోలీసులు తనిఖీలు చేపట్టారు. గల్లీలో ఉండే వారిని సంబంధించిన వెహికల్స్ డాక్యుమెంట్స్ పరిశీలించారు.  అలాగే  డాక్యుమెంట్స్ సరిగా లేని వారికి ఫైన్ వేయడం పెండింగ్ చానల్స్ ఉన్నవారికి క్లియర్ కట్టించడం జరిగింది. ఇందులో సీజ్ చేసిన వెహికల్స్ త్రి వీలర్స్ 1 , టూ వీలర్స్ 195 ,  కార్లు  2 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమనాథ్ మాట్లాడుతూ ఉన్నతాధి కారులు ఆదేశాల మేరకు బసవన్న పల్లి గ్రామం లోని కార్డెన్  సర్చ్ నిర్ణయించడం జరిగింది . అనుమానిత వ్యక్తుల కు ఇళ్లను అద్దెకు ఇవ్వద్దని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో వాహన నీయమ నీబంధలు పాటించాలని పేర్కొన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు .అలాగే వాహనాలకు నంబర్ బిగించి ధ్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలి అని పేర్కొన్నారు. సీఐ తిరుపయ్య మాట్లాడుతూ మైనర్ అబ్బాయిలకు టూ వీలర్ ఇవ్వద్దని తల్లిదండ్రులకు పేర్కొన్నారు. కార్యక్రమంలో
డి.ఎస్.పి సోమనాతం, బిక్నూర్ సీఐ తిరుపయ్య, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్, దోమకొండ ఎస్సై సుధాకర్, బిక్నూర్ ఎస్ఐ అహ్మద్ హుస్సేన్, రాజంపేట్ ఎస్సై రాజు, మరియు అన్ని పిఎస్ ల సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీజ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేరని ప్రజలు ఆందోళన చెందారు.