కార్పొరేట్ కళాశాల దందా షురూ
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు ప్రారంభమై.. కనీసం మూడ్రోజులైనా కాలేదు.. అప్పుడే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు దందాను షురూ చేశాయి. పరీక్షలు పూర్తి కాకముందే ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం తమ కాలేజీలో చేరండంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కళాశాలలు ఫోన్లు చేస్తున్నాయి. అంతేకాదు.. కార్పేరేట్ కాలేజీలకు చెందిన పీఆర్ఓలు నేరుగా ఇంటివద్దకే వచ్చి విద్యార్థులు.. వారి తల్లదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ సైతం ఇస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేరెంట్స్ .. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల వివరాలు సేకరణ
నగరంలోని అన్నీ ప్రైవేట్ కాలేజీలు .. స్కూళ్ల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి నేరుగా ఇంటికి వెళుతున్నారు. పిల్లలు.. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో కూడా ముందే చెప్పి.. ఫీజులో భారీ డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేస్తూ తల్లిదండ్రులకు ఆశలు కల్పిస్తున్నారు.
కార్పోరేట్ కళాశాలల దూకుడు నియంత్రించాలి
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కార్పోరేట్ కళాశాలల దూకుడును నియంత్రించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రైవేట్ కాలేజీల చర్యలు.. పదవ తరగతి ఫలితాలకు ముందే విద్యార్థులను మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.