కార్పొరేట్ స్థాయి విద్య కలేనా ….

 . పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు…
 . అందని యూనిఫాంలు….
దౌల్తాబాద్, జూన్ 25, జనం సాక్షి.
కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తామని ఓ వైపు ప్రభుత్వ చెప్తుంది. అయినప్పటికీ వసతుల కల్పనలో మాత్రం మొద్దు నిద్రే ఉంది. మండల పరిధిలో మొత్తం 1 ఎంజేపీబిసీ రెసిడెన్షియల్,1 కేవీవీబీ, 1 మోడల్ స్కూల్, 6 జిల్లా పరషత్ పాఠశాలలు , 5 ఉన్నత పాఠశాలలు, 23 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సుమారు అన్ని పాఠశాలల్లో కలిపి దాదాపుగా 4541 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఏ ఒక్క పాఠశాలలో కూడా ఇప్పటి వరకు యూనిఫాంలు , పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం అందజేయాలేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్ ప్రారంభించారు. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం, ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినప్పటికి పుస్తకాలు లేక విద్యార్థులకు చదువుకోవడం కష్టతరమే.ప్రభుత్వ ఓపక్క ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలని అంటూనే నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద మధ్య తరగతికి చెందిన పిల్లలే కావడం వల్ల విధ్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలో చదివించలేక ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు