కార్మికుల చట్టాలను అమలు చేయండి
– కార్మికులకు కనీస వేతనం రు. 26,వేలు ఇవ్వాలి
– సిఐటియు జిల్లా కోశాధికారి పద్మ
అశ్వరావుపేట, నవంబర్ 9( జనం సాక్షి )
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచకుండ పాలన సాగిస్తున్నాయని సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ అన్నారు.బుదవారం సిఐటియు మండల మహసభ కట్టా శ్రీను అధ్యక్షతన సత్య సాయి కళ్యణ మండపంలో జరిగింది . ఈసందర్భంగా పద్మ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తన మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ భావజాలం ప్రకారం పాలన సాగిస్తు కార్మికులకు కనీస వేతనం రోజుకు నూటడెబ్బైఎనిమిది రూపాయలు గా నిర్ణయించడం దుర్మార్గం అని అన్నారు.కార్మికులు ప్రజలు నష్టపోయే విదంగ ప్రభుత్వ రంగాన్ని నడి బజారులో అమ్మి వేస్తున్నారు అని అన్నారు.కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు చేయకుండా పారిశ్రామికవేత్త లకు ఉపయోగపడే విధంగా చట్టాలను మార్చి లేబర్ కోడ్ లను తీసుకువచ్చింది అని అన్నారు.కేసిఆర్ ప్రభుత్వం కూడా డెబ్బై మూడు రంగాలకు కనీస వేతనం సవరించకుండ గత ఎనిమిది సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్నారని అన్నారు.ప్రజలు, కార్మికుల సమస్యలు ఓపిక తో విని పరిష్కరిస్తేనే ఏ ప్రభుత్వమైన నాలుగు కాలాలు పాటు ఉంటుంది అని అన్నారు.కార్మికలకు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని,ఉద్వోగ భద్రత కల్పించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్.రాధ, నాగమణి, నందు,అప్పన్న, మురళి, దమయంతి, వెంకటప్పయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.