కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదు
విజయవాడ,డిసెంబర్21( జనం సాక్షి): ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హావిూ ఇచ్చి ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌లో చేర్చడం అన్యాయమన్నారు. కార్మికుల కనీస వేతనం రూ.24 వేలు ఇచ్చి ఇతర సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.