కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
గుంటూరు,ఆగస్ట్18(జనం సాక్షి): ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందకు నిరసనగా పోరాటం చేస్తున్నామని సిఐటియూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు అన్నారు. కార్మిక సమస్యలను సాధించడానికే సమ్మె చేపట్టామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు హక్కుల సాధనకై సమ్మెకు సిద్దమవుతున్నారని చెప్పారు. కార్మికులకు కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం విధానాల వలన పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పో తున్నారని చెప్పారు. దేవిధంగా ప్రభుత్వం రంగ సంస్థలు కార్పోరేట్ సంస్ధలకు అమ్మడవడం వలన ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగ కార్మికులు బానిసలుగా మారుతారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 7 వ వేతన సంఘం సిఫారసు అనుగుణంగా కనీస వేతనం 18 వేలు చేయాలని డిమాండ్ చేశారు.