కార్మిక శాఖ మంత్రిని కలిసిన ఐ ఎఫ్ టి యు బృందం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 02 (జనం సాక్షి) సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీ.వో నెం.22 గెజిట్ ప్రకటించి వేతనాలు పెంచాలని ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు జే. సీతారామయ్య మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22 గెజిట్ ప్రకటించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెరిగిన వేతనాలను అమలు చేయాలన్నారు. మంగళవారం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి నీ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి సమస్యను వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. 2021 జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందనీ. జి వో (జీవో నెం. 22 గెజిట్) విడుదల చేసి ఆదేశాలు జారీ చేయక పోవడం వల్ల పెరిగిన వేతనాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తీరని నష్టం జరుగుతున్నదనీ. ప్రతి నెలా అన్ స్కీల్డ్ కార్మికుడు రూ.8000 .లు, సెమి స్కీల్డ్ కార్మికులు రూ.9900లు,స్కిల్ కార్మికులు రూ.1024 లు,హైలీ స్కిల్ కార్మికులు 11 నుండి 24 వేల వరకు నష్టపోతున్నారనీ సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలలో పర్మినెంట్ కార్మికులతో పాటు సంస్థకు సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెరుగుదల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఆకాశానంటుతున్న నిత్యావసర ధరలతో నిత్యం ఆర్డిక. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గొర్రె తోక బెత్తేడన్నట్లుగా వారి ఆర్థిక పరిస్థితి ఉందని జీవో నెంబర్ 22 అమలు అయితే సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఓబి వర్కర్లకు కూడా సుమారు పాతిక వేల మంది పైగా న్యాయం జరగనున్నదని ఐ ఎఫ్ టి యు ప్రతినిధి బృందం మంత్రికి వివరించినట్లు తెలిపారు, త్వరలో ఈ సమస్య పరిష్కారానికి తమ కార్మిక శాఖ చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి రాసుద్దీన్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం అనురాధ, గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నా సర్ పాషా తదితరులు పాల్గొన్నారు.