కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ

*   మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి జూన్ 5:: టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని వారికి వచ్చే కష్ట కాలంలో తాను పాలుపంచుకుంటుందని మెదక్ జడ్పీ చైర్పర్సన్  హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన మహేష్ యాదవ్ కుటుంభానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ నుండి వచ్చిన రెండు లక్షల రూపాయల చెక్కును  మనోహరాబాద్ క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు   తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకా లతో పాటు , పార్టీ సభ్యత్వం ఉండి ప్రమాధవశాత్తూ మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయల భీమా ను అందించి వారి కుటుంభానికి ఆర్థికంగా సహాయాన్ని అందిస్తుంది అని  అన్నారు.   ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్ , వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి  ఎంపీటీసీ లత వెంకట్ గౌడ్ తెరాస సీనియర్ నాయకులు మన్నే శ్రీనివాస్  నాగరాజు సతీష్ చారీ రమేష్ గౌడ్ , దామోదర రెడ్డి,  వెంకట చారీ, బండి నరేందర్  ఆత్మ డైరెక్టర్ బిక్షపతి  సుధాకర్  శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు