కాలజ్ఞానం బ్రహ్మంగారి దివ్య దృష్టికి తార్కారం.
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తెరాస సర్కార్ చేయూత.
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములమవుదాం.
…. జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి)
కాలజ్ఞానంతో భవిష్యత్తును మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసిన బ్రహ్మంగారు ప్రతి ఒక్కరికి ఆరాధ్యుడని జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు.శనివారం కందనెల్లి, ఖాంజాపూర్ గేటు సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై నిర్వహిస్తున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రతి కులం అభివృద్ధి పథంలో ముందు ఉండాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతుందన్నారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ యజ్ఞ కార్యంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. భవిష్యత్తులో బ్రహ్మంగారి గుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. అంతకుముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ చారి, పెద్దేముల్ మండలం వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్, తెరాస నాయకులు శ్రీనివాస్ చారి, హరి గౌడ్, సుధాకర్ చారి, పులేందర్ చారి, వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.