కాలనీ సమస్యలపై సిపిఎం ఆందోళన
అమరావతి,ఆగస్ట్30(జనం సాక్షి): పేదల సమస్యలను తీర్చాలని అమరావతి తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతిలోని చెంచు కాలనీ భోగం చెరువు కాలనీ తదితర కాలనీలలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాహశీల్దార్ కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. సమస్యలపై నివేదించినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యుల పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం డివిజన్ నాయకులు దండా లక్ష్మీనారాయణ సిపిఎం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బి సూరి బాబు పాల్గొన్నారు