కాలుష్యం పై చర్యలు తీసుకోండి
కాలుష్యం పై చర్యలు తీసుకోండి
సంగారెడ్డి టౌన్ కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఇన్ ఛార్జీజేసీ మూర్తికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద పవన్ మాట్లాడుతూ జిన్నారం మండలం దోమడుగులో హెటిరో పరిశ్రమ ద్వారా వెలువడుతున్న కాలుష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు పంటలకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు సమస్యను కాలుష్య నియంత్రణ మండలి అధికారు దృష్టికి తీసుకువెళ్ళినా స్పందించటం లేదని ఆరోపించారు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో సీపీఐ జిన్నారం మండల కార్యర్శి బాల్‌రెడ్డి సత్యనారాయణ దోమడుగు గ్రామ రైతులు మోహన్‌రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.