కాలేజీ లో ర్యాగింగ్

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:- 29

 

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కస్తూర్బా జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ భూతం బహిర్గతం అయింది.
బాలికలు చదివే కేజీబీవీ కళాశాలలో సినియర్
విద్యార్థినీలు జూనియర్ లను ర్యాగింగ్ పేరిట
వేధించారు. సెకండ్ ఇయర్ చదువుతున్న
విద్యార్థినులు మొదటి సంవత్సరం నూతనంగా
ప్రవేశించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థినులను రాత్రి
సమయంలో లేపడం నిద్రపోకుండా చేయడం, ప్రేమ లేఖలు రాస్తూ వారిని బెదిరించడం, సినీయర్లమూ అంటూ మీరు జూనియర్లు అంటూ హేళన చేయడం లాంటి సంఘటనల విషయం విద్యార్థినులు తల్లిదండ్రులకు తెల్పడంతో వెలుగు చూసింది.
ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు.
కళాశాల నిబంధనలు ఉపాధ్యాయులు పాటిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. కస్తూర్బా గాంధీ కళాశాలలో ర్యాగింగ్ జరగడం మొదటిసారి. సీసీ కెమెరాలను స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

*కళాశాలలో ర్యాగింగ్ గురించి తల్లిదండ్రులు
చెబితేనే తెలిసింది*

ప్రిన్సిపాల్ గంగామణి కేజీబీవీ కళాశాలలో విద్యార్థినులు క్లాసుల వారీగా అందరూ బాగానే ఉంటారని, ప్రతి క్లాస్ కి తాను వెళ్లి విద్యార్థినుల ప్రవర్తన గమనిస్తున్నట్లు, ర్యాగింగ్ జరిగిన విషయం పిల్లల తల్లిదండ్రుల ద్వారా వారు
కళాశాలకు వస్తేనే తెలిసిందన్నారు.
ఇలా జరిగిందని విద్యార్థినులు తనతో చెప్పి ఉంటే సమస్యను ఇక్కడనే పరిష్కరించి ర్యాగింగ్ చేసిన విద్యార్థినులపై చర్య
తీసుకునేవారమన్నారు.
విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరల అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
తీసుకుంటామన్నారు.
అదేవిధంగా కస్తూరిబా కళాశాల లో
పనిచేస్తున్న ఏఎన్ఎం విద్యార్థినుల పట్ల, వారి
తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందని, కడుపు నొప్పి టాబ్లెట్ అడిగితే నీకు ఇప్పుడే కడుపునొప్పి లేవాలా అని విద్యార్థినులతో మాట్లాడుతుందని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు.