కాళోజి జీవితం స్ఫూర్తిదాయకం. అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం.
తెలంగాణ మండలికానికి గౌరవాన్ని తీసుకొచ్చిన కాలోజీ జీవితం స్ఫూర్తిదాయకమని అఖిలభారత రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం అన్నారు. శనివారం కాళోజి నారాయణరావు 110 జయంతి పురస్కరించుకొని జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూకంటి జగన్నాథం మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల భాషలో ఎలుగెత్తి చాటిన కాలోజి సాహిత్యం, జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రచయిత సంగం అధ్యక్షులు ఎలగొండ రవి, ఆడెపు లక్ష్మణ్, బూర దేవానందం, కామారపు శ్రీనివాస్, మహేష్, వెంగల లక్ష్మణ్, గణేష్, వేముల మార్కండేయులు పాల్గొన్నారు.