కాశ్మీర్‌కు సాయం కొనసాగుతుంది
ఇస్లామాబాద్,అక్టోబర్ 10(జనంసాక్షి):కశ్మీర్‌కు సాయం చేయకుండా భూవ్మిూద ఉన్న ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు. కశ్మీరులు చేస్తున్న స్వాతంత్య్ర పోరాటాన్ని భారత్ ఉగ్రవాదంగా భావిస్తోందని ఆయన అన్నారు. సోమవారం నిర్వహించిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) విూటింగ్‌లో మాట్లాడిన షరీఫ్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ రెబల్ లీడర్(హిజ్బుల్ కమాండర్) బుర్హాన్ వనీని చంపేసిన తర్వాత భారత దళాలు వందమంది కశ్మీరీ నిరసనకారులను మట్టుబెట్టాయని ఆరోపించారు. ఈ ఘటనతో రెండు అణుసామర్థ్యం కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయని షరీఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాదం సహా దేశం ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లను అధిగమిస్తామని స్పష్టం చేశారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)తో అత్యధికంగా లాభపడేది బలూచిస్థానేనని పేర్కొన్నారు. ఇదిలావుంటే పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వస్తున్న అనుమానాస్పద బెలూన్లు కలకలం రేపుతున్నాయి. వీటిపై ఉర్దూలో హెచ్చరికలు ఉండటంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రాజస్థాన్ సరిహద్దులో గుర్తించిన ఓ బెలూన్‌పై ఐ లవ్ పాకిస్థాన్ అని ఉర్దూలో ఉంది. అలాగే పంజాబ్ సరిహద్దులోని మూడు గ్రామాల్లో హెచ్చరికలతో ఉన్న బెలూన్లు కనిపించాయి. ఇక దానిపై మోదీజీ మా వద్ద అయుబీ కత్తి ఉంది.. ఇస్లామాబాద్ జిందాబాద్ అని ఉంది. పఠాన్‌కోట్ సవిూప గ్రామంలో గుర్తించిన మరో దానిపై భారత్ మాపై గెలవలేదనే పాకిస్థాన్ ప్రజల సందేశముంది. అలాగే జలంధర్ సరిహద్దు గ్రామంలో కనిపించిన ఓ బెలూన్‌పై కశ్మీర్ ప్రజలే భారత్‌ను నాశనం చేస్తారు… మోదీపై ప్రతీకారం తీర్చుకుంటాం అనే హెచ్చరికలు ఉర్దూలో ఉన్నాయి.