కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం
కారు లోయలో పడి ఐదురుగు దుర్మరణం
శ్రీనగర్,మార్చి5 (జనం సాక్షి): జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మన్సర్ సవిూపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిరది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురితో కూడిన కారు.. పంజాబ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున సాంబా జిల్లాలోని జమోడా, మాన్సర్ మధ్య అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని చెప్పారు. సహాయక బృందాలు కారులోనుంచి ఐదు మృతదేహాలను వెళికితీశాయని, గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించామని అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.