కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలనుకోవడం ఉహాత్మక కలే

– బిజెపి నేత సుబ్రమణ్య స్వామి
న్యూఢిల్లీ, జులై27(జ‌నం సాక్షి) : పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకున్న పార్టీ పిటిఐ నేత ఇమ్రాన్‌ ఖాన్‌, త్వరలో ప్రధాని కానున్న ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కాశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తారనుకోడం ఊహాత్మక కలేనని బిజెపి నేత సుబ్రమణ్యన్‌ స్వామి శుక్రవారం వెల్లడించారు. కాశ్మీర్‌ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చించాల్సిన అవసరంలేదన్నారు. అతను ఊహాత్మక కలను కలిగి ఉన్నాడని, అతను కావాలని కోరుకున్న అన్నింటి కోసం కలలు కంటున్నాడని అయితే పాకిస్తాన్‌తో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. కాశ్మీర్‌ భూభాగంలో మూడవవంతును పాకిస్తాన్‌ అక్రమంగా స్వాధీనం చేసుకుందని, త్వరలో ఆ భూభాగాన్ని తిరిగి దేశానికి అప్పగించాలని లేకుంటే వినాశనంను ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. గురువారం పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌(పిటిఐ)ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తన మొదటి ప్రసంగంలో పలు విదేశాంగ విధానాలలో ఆయన ప్రాధాన్యతల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ సమస్యపై మాట్లాడుతూ ఇరుదేశాలు ఈ సమస్యపై భేటి అయి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. కాగా, పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ తుది ఫలితాలను శుక్రవారం వెల్లడించింది.