కిక్ బాక్సింగ్ లో విద్యార్థుల ప్రతిభ

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- కిక్ బాక్సింగ్ లో రాణించడంతో భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడుతుందని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోచయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ గౌడ్ అన్నారు.చిలప్ చేడ్ మండలంలోని జగ్గంపేట గ్రామ శివారులో గల నవ భారతి మోడల్ స్కూల్ విద్యార్థులు వివేకవర్ధమాన్ గౌడ్ భవజ్ఞ లు ఈనెల 17, 18న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థులు పాల్గొన్నారు. వివేక్ వర్ధమాన్, భవిజ్ఞ రెండు బంగారు వెండి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంత్ గౌడ్ మంగళవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించాడు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేష్, నిరంజన్, సంరీన్, రోజ తదితరులు ఉన్నారు.