కిన్నెరసానికి పోటెత్తిన వరద


పాల్వంచ,జూలై8(జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. దీంతోఅధికారులు శుక్రవారం ఉదయం 6 గేట్లు ఎత్తి 56 వేల క్కుసెక్కులు నీటిని దిగువకు వదిలారు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 404.40 అడుగులు ఉంది. యనంబైల్‌ చప్టా పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కిన్నెరసాని అవతలి ఊపు ఉన్న 10 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.