కిరోసిన్‌ కొరతతో ఫాగింగ్‌కు సమస్య

యంత్రాలు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు

అనంతపురం,జూల30(జ‌నం సాక్షి): జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ దోసారెడ్డి తెలిపారు. ఫాగింగ్‌ చేయడానికి కిరోసిన్‌ కొరత ఉన్నమాట నిజమే అయినా ఎక్కడా రాజీపడడం లేదన్నారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయితే కొన్ని కారణాల వల్ల సమస్య పరిష్కారం కాలేదన్నారు. గతంలో విజిలెన్స్‌ దాడిలో పట్టుకున్న కిరోసిన్‌ ఉంది. దాన్ని ఫాగింగ్‌కు వినియోగించాలని ఉన్నతాధికారులను కోరామని, వారు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆలోచిస్తున్నారు. దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అప్పటివరకు దోమల నివారణకు అవసరమైన బ్లీచింగ్‌ తదితర కార్యక్రమాలు కొనసాగిస్తున్నా మని చెప్పారు. పదవీ కాలం ముగుస్తూండడంతో సర్పంచులు పూర్తిగా సహకరించడంలేదని, సమస్యను డీపీఓ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని చెప్పారు. వాటికి కిరోసిన్‌ సరఫరా లేకపోవడం వల్ల ఫాగింగ్‌ చేయలే కపోతున్నామంటున్నారు. అయితే ఫాగింగ్‌, స్పే పరికరాలు సు మారు 80 శాతం అదృశ్యమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రతి పంచాయతీకి రూ.10 వేలు చొప్పున మంజూరు చేశారు. 1003 పంచాయతీలకు, 87 పీహెచ్‌ సీలకు సుమారు రూ.1.80 కోట్లు విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఆ నిధులు ఖర్చుపెట్టినట్లు చూపుతున్నారు. గతంలో గ్రామ సర్పంచు, ఏఎన్‌ఎం జాయింట్‌ అకౌంట్‌లో ఈ నిధులు జమ చేసేవారు. ఈసారి గ్రామ సర్పంచు, ఆశావర్కర్‌ పేరుతో జాయింట్‌ అకౌంట్‌లో జమచేశారు. గతంలో ఏఎన్‌ఎంతో జాయింట్‌ అకౌంట్‌ ఉన్నప్పుడే ఈ నిధుల ఖర్చులో అనేక

అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆశావర్కర్‌తో జాయింట్‌ అకౌంట్‌ పెట్టడం వల్ల ఈ నిధులు పక్కదారి పట్టడం మరింత సులువయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచులకు

ఎదురు తిరిగితే ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడిపోతాయోనని ఆశావర్కర్లు ఆమోదముద్ర వేస్తున్నారు. దీంతో

నిధులు దారిమళ్లాయనే విమర్శలు ఉన్నాయి.

 

తాజావార్తలు