కివీస్‌పై జింబాబ్వే సంచలన విజయం

03-1438588270-zimbabmbwe-wi
నాలుగో ర్యాంకర్ ప్రత్యర్థి న్యూజిలాండ్ పైన జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 304 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. ఆయితే, ఆ లక్ష్యాన్ని చేధించి, ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌పై ఆదివారం అద్భుత విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ ఆరంభ పోరులోనే కివిస్‌ను మట్టికరిపించింది. జింబాబ్వే 304 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం మూడే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది.క్రెయిగ్‌ ఇర్విన్‌ (130 నాటౌట్‌) వీరోచిత శతకంతో జింబాబ్వేకు మరపురాని విజయాన్నందించాడు. ఓపెనర్లు మసకద్జ (84), చిబాబా (42) ఆకట్టుకున్నారు. కెప్టెన్‌ చిగుంబుర (26) సహకారంతో ఇర్విన్‌ మిగతా పని పూర్తి చేశాడు. అంతకుముందు టేలర్‌ (112 నాటౌట్), విలియమ్సన్‌ (97), ఇలియట్‌ (43) మెరుపులతో కివీస్‌ నాలుగు వికెట్లకు 303 పరుగులు చేసింది. ప్రధాన బౌలర్లు సౌథీ, బౌల్ట్‌ లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో కివీస్‌ బౌలింగ్‌ ఏమాత్రం ప్రభావవంతంగా కనిపించలేదు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే 1-0 ఆధిక్యంతో ఉంది.