.కిషోర్ చంద్రదేవ్ లేఖ వ్యక్తిగతం : సందీప్ దీక్షిత్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాసిన లేఖ అయన వ్యక్తిగతమని ఎఐసిసి అధికారి ప్రతినిధి సందీప్ ధీక్షిత్ చెప్పారు. కిషోర్ చంద్రదేవ్ రాసిన లేఖను అధిష్టానం పరిశీలిస్తుందని అయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను మార్చే ప్రసక్తి లేదని, ఈ విషయాన్ని కాంగ్రెసు అంద్రప్రదేశ్ వ్యవహరాల గులాం సబీ అజాద్ ఇప్పటికే చెప్పారని అయన అన్నారు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడి పనితీరు బాగుందని అయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా తాను ఏవిధమైన లేఖ రాయలేదని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేసారు.తాను ఢీల్లిలోనే ఉంటున్నాననిఏదైనా ఉంటే నేరుగా మాట్లాడుతానని లేఖలు రాయల్సిన అవసరం లేదని అయన అన్నారు. బాక్సైట్ విక్షెపాలపై మాత్రం తాను లేఖ రాశానని దానిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని అయన అన్నారు. బొత్స సత్యనారాయణపై రాసినట్టు చెబుతున్న లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని అయన అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖమంత్రి బొత్సకిరణ్‌లపై తీవ్రమైన విమర్శలు చేసినట్లుగా తెలుస్తోంది. కిరణ్‌ఓ అసమర్థ నేత అని లేఖలో అన్నట్టుతెలుస్తోంది.
తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్ కాంగ్రెసు కమీటీ అధ్యక్షుడు. రవాణా శాఖ మంత్రిబొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన అంగ్ల దిపత్రికపై తాను పరువు నష్టం దావా వేస్తానని బొత్స చెప్పారు. తాను నామినేటేడ్ అభ్యర్థినని తనను మార్చి నంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా లేఖ రాసినట్టు తనకు తెలియదన్నారు.