*కీర్తి పురస్కారం పొందిన సైదా నాయక్ కు ఘన సన్మానం*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి)
నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ గిరిజన గ్రామంలో గ్రంథాలయానికి సొంత భవనం ఏర్పాటు చేసి గిరిజనులకు విజ్ఞానాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న సైదా నాయక్ సేవలు అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం పొందిన మాలోత్ సైదా నాయక్ ను అభినందిస్తూ తెర సంస్కృతిక కళామండలి సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో చైతన్యం తీసుకువస్తూ గిరిజన హక్కులకై నిరంతరం పోరాడి గిరిజనుల్లో విజ్ఞానాన్ని అందించేందుకు సొంత భవనంలో గ్రంధాలయం ఏర్పాటు చేసి గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సైదా నాయక్ సేవలు అభినందనీయం అన్నారు. వారు చేసిన సేవలకు నిదర్శనంగా కీర్తి పురస్కారం రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెరాసాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, ఓరుగంటి వెంకట బ్రహ్మం, పాలూరి సత్యనారాయణ, తోట శ్రీను, షేక్ మీరా, యాకూబ్, చింతలపాటి శేఖర్, కొవ్వూరి వెంకట్రావు నాయుడు, బాగ్దాద్, సన్నీరు మురళి, బాల్ రెడ్డి, జూలూరు బసవయ్య,బండ్ల దాసు,షేక్ బాబా,ప్రవీణ్,బాల్తూరు సుధాకర్,రాజు నాయక్, వాల్యనాయక్,  బంకా వెంకటరత్నం,గోపు శ్రీనివాస్,హరిప్రసాద్ నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు.h