కుంకుమ పొట్లాలు ను అందిస్తున్న ఉప ప్రధాన అర్చకులు.
యాదగిరిగుట్ట జనం సాక్షి
తెలంగాణలో రెండో తిరుపతిగా పేరు ప్రఖ్యాత వస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మి స్వామి ఆలయంలో శనివారం ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు ఆలయ ఈఓ ను తన ఆఫీసులో కలిసి కోటి కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులకు కుంకుమ ఇవ్వడానికి 10000 పొట్లాలు ను మనోజ్ గిరి గోస్వామి కలిసి కవర్స్ ను అందజేయడం జరిగింది .వారు గతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాత గుట్టలో ప్రధాన అర్చకులుగా కొనసాగుతూ, కరోనా సమయంలో పేదలకు ఆహార ప్యాకెట్లు ,నీళ్ల ,మజ్జిగ ప్యాకెట్లు ,తోపాటు తనవంతు ఆర్థిక సహాయం అందజేయడంలో ముందంజలో ఉన్నారు .ఆలయానికి పరిమిత కాకుండా సమాజ సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు .పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పలువురు మాధవచార్యులను అభినందించారు.