కుట్ర రాజకీయలు తిప్పికొట్టేందుకే ధర్మపోరాట దీక్ష

తెలుగునాడు ఫెడరేషన్‌

విజయనగరం,నవంబర్‌21(జ‌నంసాక్షి): విజయనగరంలో తెలుగు నాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.బ్రహ్మం చౌదరి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అశోక్‌ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుట్ర రాజకీయాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నామన్నారు. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై పోరాటం చేసేందుకే సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నారని తెలిపారు. రాష్టానికి బిజెపి అన్ని విధాలా అనాయ్యం చేస్తుందని విమర్శించారు. విభజన హావిూలు నెరవేర్చలేదని పదే పదే సిఎం చంద్రబాబు అడుగుతున్నందుకు రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు దిగుతుందని దుయ్యబట్టారు. ఆనాడు ప్రధాన మంత్రి రాష్ట్రంలో పర్యటించి ఎన్నో హావిూలు ఇచ్చారు కానీ ఒక్కటీ నెరవేర్చలేదని చెప్పారు. బిజెపి నాలుగేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాలపై స్పష్టమైన సమాచారం బిజెపి నేతలు చెప్పకపోతే రాష్ట్రంలో వారి పర్యటనలను అడ్డుకుంటామని బ్రహ్మం హెచ్చరించారు. కేంద్రం ఇచ్చే డబ్బులకు ఆశపడి తమతో విడిపోయిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మంత్రి లోకేష్‌, చంద్రబాబులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్‌పై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్‌ విసిరినప్పటికీ పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం చూస్తుంటే ఆయన ఆరోపణలలో నిజం లేదని అర్థమవుతుందన్నారు. కేవలం బిజెపి ఇచ్చే డబ్బులకి న్యాయం చేయడానికి మాత్రమే పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పవన్‌ ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని పవన్‌ గ్రహించాలన్నారు. వైసిపి అధినేత జగన్‌ కేవలం అధికారం కోసం తాపత్రయపడుతున్నారే తప్ప రాష్టాభ్రివృద్ధి కోసం బిజెపి ఇచ్చిన హావిూలపై ఆయన నోరు మెదపకుండా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 27 న విజయనగరంలో నిర్వహించనున్న ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం విజయనగరం ఎమ్మెల్యే విూసాల గీత మాట్లాడుతూ.. విజయనగరంలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షకి లక్ష మంది వరకూ ప్రజలు రానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా ఈ దీక్షలు చేపడుతున్నామని, ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టిడిపి చేస్తున్న అభివృద్ధి ని చూసి తట్టుకోలేని పరిస్థితి లో బిజెపి, వైసిపి, జనసేనలున్నాయని మండిపడ్డారు. ఈ

కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడు, జిల్లా కార్యదర్శి ఐవిపి.రాజు, టిఎస్‌ఎన్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్య బాబు, ప్రణరు, కిషోర్‌, భరత్‌, గణెళిష్‌, సతీష్‌, నాయుడు తదితరులు పాల్గొన్నారు.