కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికలు
ఎలాంటి అక్రమాలు చోటచేసుకోలేదు
వెల్లడిరచిన ఎన్నికల అధికారి నీలం సాహ్ని
విజయవాడ,నవంబర్16(జనం సాక్షి ): కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని స్పందించారు. అక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రఫీ, సీసీటీవీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరిగిందని నీలం సాహ్ని పేర్కొన్నారు. కుప్పంలో పోలింగ్ బూత్ వెలుపల చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. చిత్తూరు ఎస్పీ కుప్పంలో ఉండి, పరిస్థితిని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు ప్రతి బూత్‌కు వెళ్లి పోలింగ్ తీరును స్వయంగా పరిశీలించారని తెలిపారు. పార్టీలు నియమించుకున్న ఏజెంట్లు అంతా పోలింగ్‌బూత్‌ల్లో ఉన్నారని ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, రీ పోలింత్ నిర్వహించమని ఎవరు కూడా కోరలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులకు పంపించినట్లు, వారు వెంటనే తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఎప్పటి కప్పుడు ఎన్నికల సంఘానికి పంపించారని వెల్లడిరచారు.