కుప్పకూలిన దక్షిణాఫ్రికా

c3lkn8m0టెస్ట్ సిరీస్ లో సఫారీలకు టీమిండియా స్పిన్నర్లు చుక్కలు చూపిస్తున్నారు.. తొలి టెస్ట్ నుంచే సఫారీలకు చెమటలు పట్టిస్తున్నారు.. మొహలీ టెస్ట్ లోనే సఫారీల భరతం పట్టిన అశ్విన్, జడ్డూ, మిశ్రా త్రయం ఒకే రోజు జరిగిన బెంగళూర్ టెస్ట్ లోనూ అదుర్స్ అనిపించారు.. ఇక నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లోనూ స్పిన్నర్లు అద్భుత బౌలింగ్ తో అలరించారు.. సఫారీలను స్వల్పస్కోర్ కే ఆలౌట్ చేశారు.

ఇక ప్రీడమ్ సిరీస్ లో అశ్విన్, జడేజాలు జోరు చూపిస్తున్నారు.. మొహలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు తీస్తే.. జడేజా మూడు వికెట్లతో సత్తా చాటాడు.. మిగితా రెండు వికెట్లు మిశ్రా ఖాతాలో వేసుకున్నాడు..ఇక రెండో ఇన్నింగ్స్ లో జడేజా ఐదు వికెట్లు తీస్తే అశ్విన్ మూడు వికెట్లతో మెరిసారు.. మిశ్రా కీలక వికెట్ తీసి టీమ్ విక్టరీలొ తనవంతు పాత్ర పోషించాడు.

ఇక ఒకే రోజు జరిగిన బెంగలూరు టెస్ట్ లోనూ టీమిండియా స్పిన్నర్లదే హావా నడిచింది.. సఫారీలను తొలి రోజే ఆలౌట్ చేయడంలో స్పిన్నర్లు పాత్ర ఎంతో కీలకం.. ఈ టెస్ట్ లో అశ్విన్, జడేజాలు తలో నాలుగు వికెట్లు తీసి సఫారీలను ఓ ఆట ఆడుకున్నారు.. ఇక ఈ రెండు టెస్ట్ ల్లో పేసర్లు తీసిన వికెట్లు కేవలం రెండు మాత్రమే.

ఇక నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లోనూ అశ్విన్ అండ్ కో అదరగొట్టింది.. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలను 79 పరుగులకే ఆలౌట్ చేసింది.. ఆరంభం నుంచే సఫారీలపై సూపర్ బౌలింగ్ తో ఒత్తిడిలోకి నెట్టిన స్పిన్నర్లు.. వరసగా వికెట్లతో విరుచుకుపడ్డారు.. సఫారీల పది వికెట్లు పంచుకున్నారు… అశ్విన్ మరోసారి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుంటే.. జడేజా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.. ఎప్పట్లాగే కీలక వికెట్ ను మిశ్రా తన ఖాతాలో జమా చేసుకున్నాడు.
ఇటు సఫారీ స్పిన్నర్లు సైతం సిరీస్ లో పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తున్నారు.. మూడు టెస్ట్ ల్లోనూ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించారు. స్పెషలిస్ట్ సిన్నర్లు ఇప్పటి వరకు హర్మర్ 9, ఇమ్రాన్ తాహీర్ 5, పార్టటైమ్ స్పిన్నర్ ఎల్గర్ 5 వికెట్లు తీశారు.

ఈ సిరీస్ లో పోటాపోటీగా వికెట్లు సాధిస్తున్న అశ్విన్, జడేజాలు మోస్ట్ వికెట్స్ లిస్ట్ లో ముందున్నారు.. ఇప్పటి వరకు అశ్విన్ నాలుగు ఇన్నింగ్స్ ల్లో కలిపి 11.29 సగటుతో 17 వికెట్లు పడగొట్టగా.. జడేజా 9.92 సగటుతో 16 వికెట్లు తీశాడు.. ఇక మిశ్రా నాలుగు వికెట్లు తీశాడు.
ఓవరాల్ గా టెస్ట్ సిరీస్ లో టీమిండియా స్పిన్నర్లు భళా అనిపిస్తున్నారు.. వరుస వికెట్లతో హోరెత్తిస్తున్నారు.. జట్టు విజయాల్లో కీలక పాత్రపోషిస్తున్నారు.